: పశువధ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు


పశువుల రవాణా, వధపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. దీనిపై కేంద్రం రెండు వారాల్లోపల స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమ్ ఖురేషి ఈ పిటిషన్ వేశారు. కేంద్రం ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, వివక్షా పూరితమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆదేశాలు పశువుల వ్యాపారంపై ఆధారపడిన వారి జీవనోపాధిని దెబ్బతీస్తాయని వాదించారు. ప్రభుత్వం తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ హాజరై దేశవ్యాప్తంగా పశువుల వర్తకంపై ఓ నియంత్రిత విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News