: మన ఎర్రకోట పాకిస్థాన్ దట.. చైనా నిర్వాకం!


చైనాలో జరుగుతున్న ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆ దేశానికి చెందిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాక్ ప్రతినిధి మసూద్ ఖలీద్ హాజరయ్యారు. ఇందులో ఓ ఛాయాచిత్రాన్ని లాహోర్ లోని షాలిమార్ గార్డెన్స్ గా నిర్వాహకులు పేర్కొన్నారు. దాన్ని చూసిన భారత్, పాక్ ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. ఆ ఛాయాచిత్రం ఏమిటంటే... ఢిల్లీలోని మన ఎర్రకోట. ఎర్రకోటపై మన మువ్వన్నెల జెండా కూడా ఎగురుతుండటం గమనార్హం.

దీంతో, వెంటనే ఈ విషయాన్ని నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లారు మనవాళ్లు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నప్పుడు, ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. దీంతో, జరిగిన తప్పుకు నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News