: యోగీ! ఉత్తచేతుల్తో రావద్దు... చేతలతో రా!: నితీష్ కుమార్ సలహా


  గత బీహార్ ఎన్నికల్లో విజయం తమదేనని ఢంకా బజాయించిన బీజేపీకి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ లోని దర్బాంగాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రసంగించేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ను ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ఆహ్వానించింది. ఈ నేఫథ్యంలో ఆయన నేడు బీహార్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సవాలు విసిరారు. యూపీలోలా బీహార్ కు ఉత్తచేతుల్తో రావద్దని అన్నారు. చేతలతో రావాలని సూచించారు. బీహార్ లో లాగ యూపీలో మద్య నిషేధం విధించాలని అన్నారు. తమ రాష్ట్రంలోలా ఉత్తరప్రదేశ్ లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే బీహార్ లో అడుగుపెట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని.... తాము మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన బీజేపీని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News