: భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. రచ్చరచ్చ చేసి, కొట్టుకున్న అతిథులు!


పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ఇచ్చిన ఇఫ్తార్ విందు రచ్చరచ్చ అయింది. చివరకు రసాభాసగా ముగిసింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకలికి తట్టుకోలేక... బిర్యానీ కోసం కొట్టుకున్నారు. చికెన్ ముక్కలు, మటన్ ముక్కల కోసం ఎగబడ్డారు. ఒకొరినొకరు తోసుకుంటూ బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. కొట్టుకున్నారు కూడా. కొందరైతే టేబుల్ పై పెట్టిన ఆహార పదార్థాలను పడేసి, అందులో ఎంగిలి ప్లేట్లు పడేశారు. దీంతో, అక్కడి పరిస్థితి చాలా అసహ్యంగా మారింది. రంజాన్ మాసంలో తిండి కోసం కొట్టుకోవడం ఏమిటంటూ పలువురు పాకిస్థానీలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News