: ప్రాక్టీస్ కు ముందు కోహ్లీ, ధావన్, యువీ ఎంత హుషారుగా ఉన్నారో చూడండి!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు బర్మింగ్ హామ్ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ కు ముందు కోహ్లీ, ధావన్, యువరాజ్ సింగ్ ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరు ముగ్గురూ మాట్లాడుతూ సహచర ఆటగాళ్లను అనుకరిస్తూ డ్యాన్సు లు చేశారు. దీనిని వీడియో తీసిన ఔత్సాహికులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా... ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి. ఈ ముగ్గురి చిన్న స్టెప్పులు అలరిస్తాయి.