: సందట్లో సడేమియా... వరదల్లో ఖైదీలు పారిపోయారు


సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. ఇండొనేషియాలోని జాంబిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నీటి ప్రభావంతో ఆ ప్రాంతంలోని ఒక జైలు గోడ కూలింది. దీనిని అదనుగా చేసుకున్న ఖైదీలు పరారయ్యారు. ఈ జైలులో 1238 మంది ఖైదీలుండగా, 50 మందికి పైగా పరారైనట్టు గుర్తించారు. దీంతో గాలింపు చేపట్టి 21 మందిని తిరిగి పట్టుకోగలిగారు. జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. జైల్లోకి కూడా నీరు భారీ ఎత్తున చేరడంతో ఖైదీలను మరో ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News