: బిగ్ బాస్కెట్ ను చేజిక్కించుకునే యోచనలో అమెజాన్!
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్ లో భారీగా విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆన్ లైన్ కిరాణా వస్తువుల వెబ్ సైట్ బిగ్ బాస్కెట్.కామ్ ను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక దశ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి బిగ్ బాస్కెట్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ సంస్థ యాజమాన్యం బావిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల వస్తువుల అమ్మకాలను కొనసాగిస్తున్న అమెజాన్... కిరాణా, ఆహారం అమ్మకాలను చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే బిగ్ బాస్కెట్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది.