: పబ్లిక్‌లో పెద్దలకు చీత్కారాలే.. సర్వేలో వెల్లడైన నిజం!


పెద్దలను గౌరవించడం మన సంప్రదాయమన్న మాట కాగితాలకే పరిమితమవుతోంది. నిజానికి బహిరంగంగా పెద్దలకు లభిస్తున్న గౌరవం అంతంత మాత్రమేనని తేలింది. ‘వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ ఎవేర్‌నెస్ డే’ సందర్భంగా ‘హెల్పేజ్ ఇండియా’ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది పబ్లిక్‌గా తాము చీత్కారాలు ఎదుర్కొంటున్నామని, తమకు అవమానాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

 సమాజంలో పెద్దలపై వివక్ష ఎక్కువైందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో తమకు అవమానాలు ఎదురవుతున్నాయని, కొన్నిసార్లు కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని, దాడులు కూడా జరుగుతున్నాయని బెంగళూరులో 70 శాతం మంది పేర్కొన్నారు. ఢిల్లీలో మాత్రం పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉంది. అక్కడ 23 శాతం మంది పెద్దలకు బహిరంగ ప్రదేశాల్లో సరైన గౌరవం లభిస్తోంది.

  • Loading...

More Telugu News