: కీలకంగా మారిన కాల్ డేటా...శిరీషతో ఎస్సై ప్రభాకర్ కు అనుబంధం!


సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషియన్ శిరీష మృతి కేసులు మిస్టరీగా మారాయి. శిరీష హత్యకు గురికాగా, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ప్రభాకర్ రెడ్డి హైదరాబాదు వెళ్లాడని, శిరీషపై లైంగిక వేధింపులకు దిగాడని, దీంతో ఆ విషయం బయటకు వస్తే ఉద్యోగం, పరువు పోతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది. శిరీష్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ప్రభాకర్ రెడ్డి, శిరీష మధ్య సంబంధాలు ఉన్నాయని తేలిందని చెబుతున్నారు.

అయితే, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. తన భర్తకు ఎవరితోనూ సంబంధాలు లేవని, కేవలం కేసును తప్పుదోవపట్టించేందుకు తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి భార్య స్పష్టం చేశారు. దీనిపై శిరీష భర్త మాట్లాడుతూ, సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన శిరీష...ఆలస్యమవుతుందని 8 గంటల సమయంలో చెప్పిందని, దీంతో తాము రాత్రి 11 గంటల సమయంలో భోజనం చేసి నిద్రపోయామని, అయితే 3 గంటల సమయంలో తను హైదరాబాదుకు 71 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు లొకేషన్ షేర్ చేసిందని చెప్పారు.

తాను కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించానని, ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వెళ్లిపోయానని చెప్పారు. అనంతరం పోలీసులు ఫోన్ చేసి ఆమె హత్య గురించి చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభాకర్ కు శిరీషతో పరిచయం ఎలా జరిగింది? అన్న విషయంలో ఆమె పని చేసిన సంస్థ అధికారి రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ లను ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్వినిని కూడా విచారించనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News