: ఇదీ! తమిళనాడులోని ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి.. మూడు కాలేజీల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు!


తమిళనాడులోని ఇంజినీరింగ్ కాలేజీల దుస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలోని 506 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో గతేడాది డిసెంబరులో నిర్వహించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను అన్నా యూనివర్సిటీ విడుదల చేసింది. ఇందులో తిరునల్వేలి, కాంచీపురం, కోయంబత్తూరులోని మూడు కాలేజీలకు చెందిన మొత్తం 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 506 కాలేజీల్లో కేవలం 8 కళాశాలలు మాత్రమే 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 253 కాలేజీలు 50 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 12 కాలేజీలు ఉత్తీర్ణత శాతం పదిశాతం కంటే తక్కువే ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News