: నేనేమైనా సన్యాసినా...మళ్లీ పెళ్లి చేసుకుంటా...ఈసారి కూడా ప్రేమ వివాహమే: అమలాపాల్ సంచలన ప్రకటన
ప్రముఖ కోలీవుడ్ నటి అమలా పాల్ పలు వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారుతోంది. ఈ మధ్యే సింగర్ సుచిత్ర లీక్ చేసిన తన రాసలీలల వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా 'వేలై ఇల్లా పట్టాదారి–2' ('రఘువరన్ బీటెక్-2') సినిమా ప్రమోషన్ సందర్భంగా... మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... 'నేనేమైనా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళ్లతానని చెప్పానా?' అని అడిగింది.
తర్వాత మళ్లీ చెబుతూ, తాను కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటానని, ఈ సారి కూడా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పింది. అయితే ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్పి పెళ్లి చేసుకుంటానని తెలిపింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాగా, 2015లో అమలాపాల్ దర్శకుడు విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వివాహానంతరం మనస్పర్థలు రావడంతో, తొందరపడి వివాహం చేసుకున్నానంటూ తెగదెంపులు చేసుకుంది.