: 'రాత్రికి మీ ఇంటికి వస్తాను... రెడీగా ఉండు' అన్న ఎస్సైకి షాక్ ఇచ్చిన మహిళ!
‘‘రాత్రి మీ ఇంటికి వస్తాను.. నీతో సరదాగా కాసేపు గడుపుతాను..రెడీగా ఉండు’’ అంటూ కామాంధుడైన ఎస్సై చేసిన ప్రతిపాదనకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ జిల్లాలో ఒక వ్యక్తి కిలో నల్లమందు కలిగి ఉండడంతో అతనిని అరెస్టు చేశారు. భర్తను విడిపించుకునేందుకు వెళ్లిన అతని భార్యను ఎస్సై కమల్ ధన్ చరణ్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లక్ష రూపాయలు ఎలాగోలా సర్దిన ఆమె, మరో లక్షకు చెక్కు రాసి ఇచ్చింది. తన దగ్గర చెక్కులు చెల్లవని, డబ్బే కావాలని ధన్ చరణ్ ఆమెకు స్పష్టం చేశాడు.
అయితే డబ్బు తనవద్ద లేదని చెప్పడంతో...."అయితే రాత్రికి వస్తాను...రెడీగా ఉండు...నీతో సరదాగా గడుపుతాను....లక్ష రూపాయలు చెల్లయిపోతుంది" అని ప్రతిపాదించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నప్పటికీ, ఆ భావాలను పైకి కనబడనీయకుండా ‘‘ముస్తాబై సిద్ధంగా ఉంటాను... వచ్చేయండి’’ అని సమాధానం ఇచ్చింది. దీంతో తొందరగా డ్యూటీ ముగించుకుని సంబరపడుతూ వెళ్లిన ధన్ చరణ్ ఆమె తలుపు కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచే ఉందని సమాధానం రావడంతో సంతోషంగా లోపలికి వచ్చాడు. అక్కడ ఎదురుగా ఏసీబీ అధికారులు ప్రత్యక్షం కావడంతో.. ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే అధికారులు అతనిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.