: ఛాంపియన్స్ ట్రోఫీ: 211 పరుగుల వద్ద 49.5 ఓవర్లకి ఇంగ్లండ్ ఆలౌట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 49.5 ఓవర్లకి 211 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఓపెనర్లు బెయిర్ స్టో 43, హేల్స్ 13 పరుగులకి అవుటయ్యారు. రూట్ 46, మోర్గాన్ 33, బట్లర్ కూడా 4 పరుగుల వ్యక్తిగత స్కోరుకే ఒకరి తరువాత ఒకరు కొద్ది వ్యవధిలోనే వెనుదిరిగారు. ఇక స్టోక్స్ 34, అలీ 11, రషీద్ 7, ప్లంకెట్ 9, వుడ్ 3, బాల్ 2 (నాటౌట్) పరుగులు చేసి వెనుదిగారు. దీంతో ఇంగ్లండ్ 10 వికెట్ల నష్టానికి 49.5 ఓవర్లలో 211 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో హాసన్‌కి మూడు వికెట్లు దక్కగా, రయీస్, జునైడ్‌లకి రెండేసి వికెట్లు దక్కాయి. ఇక షాదాబ్ ఒక వికెట్ తీశాడు.