: యంగ్ హీరో రానా టీవీ షో టీజర్ విడుదల.. మీరూ చూడండి!
తాను కూడా టీవీ షోలో ఎంట్రీ ఇస్తున్నానని చెబుతూ దగ్గుబాటి రానా ఈ రోజు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించి తన అభిమానులను ఖుషీ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే జెమిని టీవీలో ప్రారంభం కానున్న 'నెంబర్ వన్ యారీ విత్ రానా' అనే ప్రోగ్రాంలో ఆయన హోస్ట్‌గా కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే విడుదల చేసిన రానా.. తాజాగా ఆ టీవీ ప్రోగ్రాం టీజర్‌ను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఏంటో తెలియాల్సి ఉంది. సినిమా టీజర్‌ను తలపిస్తోన్న ఈ వీడియోను మీరూ చూడండి...