: రేపటి మ్యాచ్ నేపథ్యంలో.. భారత్‌పై అభ్యంతరకర పోస్టులు చేస్తున్న బంగ్లాదేశ్ అభిమానులు
ప్రస్తుతం కొనసాగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అనూహ్యంగా సెమీఫైనల్‌లోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. రేపు ఆ జట్టు బలమైన టీమిండియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు తమ బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. గతంలో ఓ కీలక మ్యాచ్‌లో ఇండియాతో బంగ్లాదేశ్ తలపడుతున్న సమయంలో సోషల్ మీడియాలో భారత క్రికెటర్లపై అనుచితంగా పోస్టులు చేసిన బంగ్లా అభిమానులు.. ఈ సారి కూడా అటువంటి పోస్టులే చేస్తూ రెచ్చిపోతున్నారు. భారత్‌ను అవమానిస్తూ అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారు. ఓ శునకం వెంటపడుతున్న పులి చిత్రాన్ని చూపిస్తూ.. భారత్‌ను వేటాడుతున్న బంగ్లా అని పేర్కొన్నారు. దీనిపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.