: తెలుగు టీవీ షోలో యాంకర్‌గా యంగ్ హీరో రానా.. ఫస్ట్ లుక్ అదుర్స్!
తెలుగు టీవీ షోలో యాంకర్‌గా కనిపించి అలరించడానికి మరో టాలీవుడ్ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోల బాటలోనే నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా టీవీ షోలో ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి రానా కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. జెమిని టీవీలో త్వరలోనే తాను కనిపించనున్నానని, ఆ ఛానెల్‌లో రానున్న నెంబర్ వన్ యారీ విత్ రానా అనే ప్రోగ్రాంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానని రానా తెలిపాడు. ఇందుకు సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశాడు. త్వరలోనే సదరు టీవీ ప్రోగ్రాం టీజర్ విడుదల కానుంది.