: అదుపుతప్పి నదిలో పడ్డ బస్సు .. 8 మంది మృతి... మరో 35 మందికి గాయాలు
ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయిన ప్రమాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని సంబంధిత అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయాలపాలయిన మరో 35 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.