: యుద్ధం వద్దు.. చర్చలే ముద్దు!: భారత్-పాక్ సంబంధాలపై సల్మాన్ ఖాన్


కశ్మీర్ లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దీనిపై స్పందించాడు. యుద్ధం చేయడమొక్కటే దీనికి పరిష్కారం కాదని... పాకిస్థాన్ తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవడమే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. యుద్ధం చేయాలంటూ సూచించే వారిని పాక్ సరిహద్దులకు పంపించాలని... వీరితోనే తొలుత యుద్ధం చేయించాలని అన్నాడు. అప్పుడు వారి చేతులు, కాళ్లు వణుకుతాయని... ఒక్క రోజులోనే యుద్ధం ముగిసిపోతుందని చెప్పారు. ఆ తర్వాత ఇలాంటి వారంతా ఓ టేబుల్ చుట్టూ కూర్చొని.... మాట్లాడుకుంటారని సల్మాన్ నవ్వుతూ చెప్పాడు. తన కొత్త సినిమా 'ట్యూబ్ లైట్' ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అలా చెప్పుకొచ్చాడు. యుద్ధం జరిగితే సరిహద్దులకు ఇరువైపులా ఎంతో మంది చనిపోతారని తెలిపాడు.  

  • Loading...

More Telugu News