: బీజేపీకి మద్దతిచ్చేందుకు 17 పార్టీలు రెడీగా ఉన్నాయి: మోదీకి చెప్పిన వెంకయ్య
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో బీజేపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పార్టీలోని సీనియర్లతో ఈ కమిటీ నేడు సమావేశమైంది. అనంతరం కమిటీ సభ్యులు భేటీ వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు పలికేందుకు మొత్తం 17 రాజకీయ పార్టీలు రెడీగా ఉన్నాయని మోదీతో కమిటీ సభ్యుడు వెంకయ్యనాయుడు తెలిపారు. మిగిలిన పార్టీలను కూడా సంప్రదించాలని ఈ సందర్భంగా వీరికి ప్రధాని సూచించారు. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేయనుంది.