: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర చర్చలు
రాష్ట్రపతి ఎన్నిక కోసం వచ్చేనెల 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఎన్నిక బరిలోకి తమ అభ్యర్థిగా ఎవరిని దింపాలనే అంశంపై ఎన్డీఏ, యూపీఏ వేర్వేరుగా ముమ్మరంగా చర్చలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు. తమ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లేలోపు (జూన్ 24లోపు) ఎన్డీఏ నామినేషన్ వేయాలని యోచిస్తోంది. మరోవైపు ఎల్లుండి రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ త్రిసభ్య కమిటీ ప్రతిపక్ష నేతలతో భేటీ కానుంది. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సోనియా గాంధీ, ఏచూరీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.