: నిజాంపేటలో 4 ఎకరాల భూమి కబ్జాకు స్థానిక నేతల యత్నం.. అడ్డుకున్న భూమి యజమానులు.. వీడియో మీరూ చూడండి


గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జా భూములు, వివాదాస్పద భూములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరోవైపు, ఇదే తరహాలో నిజాంపేట్ పరిధిలోని శ్రీనివాస హౌసింగ్ సొసైటీకి చెందిన 4 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ భూములను సొసైటీకి చెందిన 63 మంది కొన్నారు. రెండ్రోజుల క్రితం సొసైటీకి చెందినవారు ఈ భూమికి ఫెన్సింగ్ వేసుకున్నారు. మొన్న రాత్రి ఓ ముఠా అక్కడకు చేరుకుని ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ సిబ్బంది అని చెబుతూ వారు ఫెన్సింగ్ ను కూల్చేశారు.  ఈ సందర్భంగా ఫెన్సింగ్ ను కూలుస్తున్న వారితో భూమి యజమానులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డు చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఆఫీసుకు వస్తే చూపిస్తానంటూ సదరు వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో, 172/15 సర్వే నంబరులో ఉన్న ఈ 4 ఎకరాల 9 గుంటల భూమిని కొనుగోలు చేసిన వారంతా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News