: సినారె అంత్యక్రియలు పూర్తి
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయనకు సాహితీ వేత్తలు, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు అంతిమ వీడ్కోలు చెప్పారు. సినారె అంతిమ సంస్కార క్రతువును ఆయన మనవడు చైతన్యదేవ్ నిర్వహించాడు. చైతన్యదేవ్ సినారె పెద్ద కుమార్తె గంగ కుమారుడు. సినారె అంతిమ సంస్కారాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. సినారె లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరని పేర్కొంటూ సాహితీ వేత్తలు, తెలుగు భాషాభిమానులు నివాళులర్పించారు.