: భారత క్రికెటర్లకు వార్నింగ్ ఇస్తున్న బంగ్లా బౌలర్!


రేపు బంగ్లాదేశ్ తో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతున్న వేళ, బంగ్లా కీలకబౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడి ఒకే వికెట్ తీసిన ముస్తాఫిజుర్, సెమీస్ లో తాను రాణిస్తానని, భారత ఆటగాళ్లకు ఆఫ్ కట్టర్ లు సంధించి ఇబ్బంది పెడతానని అంటున్నాడు. రేపటి మ్యాచ్ లో విజయం తమదేనని ధీమాగా చెప్పిన ముస్తాఫిజుర్, ఇండియన్ ప్లేయర్స్ ను నిలువరించి చూపుతానని, ఇంగ్లండ్ లోని పిచ్ లు పేసర్లకు పెద్దగా అనుకూలించక పోవడంతోనే తనకు వికెట్లు దక్కలేదని అన్నాడు. తన శక్తి వంచన లేకుండా బంగ్లాదేశ్ విజయానికి కృషి చేస్తానని, ఈ మ్యాచ్ లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News