: పాకిస్థాన్ తీవ్రవాదుల అడ్డా.. మా ప్రాజెక్టులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం: చైనా
తమ దేశీయులను ఇద్దరిని పాకిస్థాన్ లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత హత్య చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చైనాకు అసలైన తత్వం బోధపడుతోంది. పాకిస్థాన్ తీవ్రవాదులకు అడ్డా అని, అక్కడ చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది.
చైనా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నాయని... ఇదే సమయంలో ఈ కంపెనీలు ఉగ్రవాదానికి బాధితులయ్యే ప్రమాదం కూడా పెరిగిపోతోందని పేర్కొంది. తమ దేశ పౌరులను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడం, లేదా మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నాన్ని ఉగ్రవాదులు చేస్తున్నారని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి చైనా ప్రాజెక్టులకు ముప్పు పెరుగుతోందని వెల్లడించింది.