: 'దంగల్' జైత్రయాత్ర.. మరో రికార్డు బద్దలు!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా ఇంకా రికార్డులను సృష్టిస్తూనే ఉంది. భారత్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం... చైనాలో విడుదలైనప్పటి నుంచి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారతీయ సినిమా ఖ్యాతిని, స్టామినాను ప్రపంచానికి చాటిచెబుతోంది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లను సాధించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. భారత్ లో 84.4 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం... చైనాలో 179.8 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అన్ని ప్రాంతాలతో కలిసి 300 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ ఇంగ్లీష్ సినిమాలు ఇవే...
ది మేర్మెయిడ్ - చైనా - 533 మిలియన్ డాలర్లు
ది ఇన్ టచబుల్స్ - ఫ్రాన్స్ - 427 మిలియన్ డాలర్లు
మాన్ స్టర్ హంట్ - చైనా - 386 మిలియన్ డాలర్లు
యువర్ నేమ్ - జపాన్ - 354 మిలియన్ డాలర్లు
దంగల్ - ఇండియా - 300 మిలియన్ డాలర్లకు పైగా (ఇంకా వసూళ్లు రాబడుతోంది)