: శిల్పా మోహన్ రెడ్డిని కౌగిలించుకుని ఆహ్వానించిన జగన్


నిన్నటివరకూ తెలుగుదేశం పార్టీ నేతగా, కర్నూలు జిల్లాలో కీలక వ్యక్తిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వైకాపాలో చేరిపోయారు. శిల్పా పార్టీ ఫిరాయింపుపై గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం హైదరాబాద్ లో జగన్ ఇంటికి భారీ ఎత్తున జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కార్యకర్తలతో తరలివచ్చిన శిల్పా మోహన్ రెడ్డిని, జగన్ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. ఆపై వైకాపా కండువా కప్పారు. అంతకుముందు శిల్పా మాట్లాడుతూ, తన కార్యకర్తల అభీష్టం మేరకే వైకాపాలో చేరానని, నంద్యాల టికెట్ ను ఆశించి కాదని అన్నారు. జగన్ నాయకత్వంలో కర్నూలు జిల్లాలో పార్టీని పటిష్ఠపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News