: క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. టీమిండియా భేష్ అంటూ కితాబు!
టీమిండియాపైన, టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ట్విట్టర్లో తాను చేసిన వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో లతీఫ్ కంగుతిన్నాడు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయడమే కాకుండా సెహ్వాగ్, కోహ్లీలపై ప్రశంసలు కురిపించాడు. సెహ్వాగ్ చాలా గొప్ప బ్యాట్స్ మెన్ అని కితాబిచ్చాడు. కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ అని అన్నాడు. అయితే, ఎంతో నిజాయతీపరుడైన హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేకు విరుద్ధంగా కోహ్లీ వ్యవహరిస్తున్నాడని, అది అతనికి తగదని చెప్పాడు. టీమిండియాకు ఫైనల్ చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.