: ఆత్మహత్య కాదు, హత్యే... వీడిన బాలీవుడ్ హీరోయిన్ కృతికా చౌదరి మర్డర్ మిస్టరీ!


నిన్న కలకలం సృష్టించిన బాలీవుడ్ హీరోయిన్ కృతికా చౌదరి మర్డర్ వెనకున్న మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ముంబై, అంధేరీ పశ్చిమ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో అర్ధ నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని తేల్చిన పోలీసులు, హత్యకు ముందు అత్యాచారం జరగలేదని తేల్చారు. ఆమెను పిడికిలికి ధరించే లోహాయుధం (కున్ కుల్ డస్టర్)తో తలపై కొట్టి హత్య చేశారని, కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని, హత్యకు వినియోగించిన ఆయుధాన్ని గుర్తించామని తెలిపారు.

ఈ నెల 5న పుట్టిన రోజు జరుపుకున్న ఆమె, నాలుగు రోజుల క్రితం హత్యకు గురైందని తెలిపారు. హరిద్వార్ లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు హత్య సమాచారాన్ని అందించామని, నేడు వారు ముంబైకి చేరుకోవచ్చని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అపార్టుమెంట్ వాచ్ మన్, భైరవ్ నాథ్ సొసైటీలో కృతికా రెగ్యులర్ గా వెళ్లే షాపుల యజమానులను ప్రశ్నించి, ఆపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. రెండేళ్ల క్రితం భర్తతో తెగతెంపులు చేసుకున్న కృతికా, ఒంటరిగా ముంబైలో నివసిస్తూ హత్యకు గురైంది.

  • Loading...

More Telugu News