: మనవడిని ఎత్తుకున్న తాతయ్యలు గంటా, నారాయణ... ఎలా మురిసిపోతున్నారో చూడండి!
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులు ఒకేసారి తాతయ్యలయ్యారు. మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణికి, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజలకు నవంబర్ 2015లో వివాహం జరుగగా, ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో నారాయణ కుమార్తె శరణి పురుడు పోసుకుంది. మనవడు పుట్టాడని తెలుసుకున్న వియ్యంకులు గంటా, నారాయణలు ఆసుపత్రికి వెళ్లి బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. ఆ ఫోటో మీరూ చూడవచ్చు.