: వైసీపీలో చేరడం అన్నయ్య ఇష్టం.. నాతో మాటమాత్రమైనా చెప్పకుండానే పార్టీ మారారు: శిల్పా చక్రపాణి రెడ్డి
తన అన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరినా... తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. అన్నదమ్ముల బంధం వేరు, రాజకీయాలు వేరని ఆయన తెలిపారు. తాను కేరళలో ఉన్నానని... తనతో మాటమాత్రంగానైనా చెప్పకుండానే మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మోహన్ రెడ్డి మంత్రిగా పనిచేస్తున్నప్పుడు తాను వైసీపీలో పనిచేశానని... అయితే, తనకు ఆ పార్టీలో సరైన గౌరవం లభించలేదని... అందుకే టీడీపీలో చేరానని తెలిపారు. తనకు చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయమని చంద్రబాబు ఆదేశిస్తే... దాన్ని శిరోధార్యంగా భావిస్తానని తెలిపారు.