: శ్రీవారి ఆలయం ఎదుట కలకలం... ఏడాది చిన్నారి కిడ్నాప్, సీసీటీవీలో దృశ్యాలు


తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఎదుట చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. గొల్లమండపం వద్ద తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిద్రలేచి పక్కన బాబు లేడని చూసుకున్న దంపతులు బోరున విలపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా, కిడ్నాప్ దృశ్యాలు అందులో కనిపించాయి. ఉదయం 5 గంటలకు బాలుడిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోందని, వాటి ఆధారంగా దర్యాఫ్తు చేపట్టామని, బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించామని పోలీసు అధికారులు తెలిపారు. దైవదర్శనానికి వస్తే తమ బిడ్డను ఎత్తుకుపోయారంటూ, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బాలుడి తండ్రి వెంకటేష్ విలపిస్తుంటే, ఇతర భక్తులు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News