: సినారె పార్థివ దేహాన్ని చూసి... చలించిపోయి, కంటతడి పెట్టిన గవర్నర్!


ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సినారెకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినారె మరణం తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. రవీంద్ర భారతిలో తాను, సినారె చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నామని చెప్పారు. సినారె తనను ఇంటి పేరుతో సహా పిలిచేవారంటూ గుర్తు చేసుకున్నారు. సినారె భౌతికకాయం వద్ద నరసింహన్ కంటి తడి పెట్టారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చలించిపోయారు.

  • Loading...

More Telugu News