: సర్కారు కీలక నిర్ణయం... కేకే కొన్న భూముల రిజిస్ట్రేషన్ రద్దు!


రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనుగోలు చేసిన గోల్డ్ స్టోన్ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, దండుమైలారంలో ఆయన కుమార్తె, కోడలు తదితరుల పేరిట రిజిస్టర్ అయిన 38 ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ భూమిని గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచే కేకే కుటుంబీకులు కొనుగోలు చేసినట్టు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఇవి '22 ఏ' నిబంధన కింద డిక్లేర్ చేసిన భూములు కావడంతో పెను వివాదం తలెత్తింది. ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే భూముల రిజిస్ట్రేషన్ రద్దు జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News