: పెన్‌డ్రైవ్‌ నిండా బూతు వీడియోలు.. జైలులోని మావోయిస్ట్‌కు అందించిన ఇద్దరి అరెస్ట్


జైలులో శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టుకు పెన్ డ్రైవ్ నిండా పోర్న్ వీడియోలు నింపి అందించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మావోయిస్ట్ అనురూప్ కోయంబత్తూరు  సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి కోసం మరో మావోయిస్ట్ సీపీ మొయిదీన్ సోదరుడు సీపీ రషీద్, హరిహర శర్మలు కలిసి జైలుకు దుస్తులు తీసుకొచ్చారు. అనుమానంతో ఆ దుస్తులను పరిశీలించిన జైలు అధికారులకు ప్యాంటుకున్న రహస్య జేబులో ఓ పెన్‌డ్రైవ్ కనిపించింది. కోయంబత్తూరు పోలీసుల బృందం ఆ పెన్‌డ్రైవ్‌‌లోని ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసి చూసి ఆశ్చర్యపోయారు. దాని నిండా బూతు వీడియోలే ఉన్నాయి. ఈ పోర్న్ వీడియోల వెనక రహస్యంగా మరే ఫైల్స్ అయినా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దుస్తుల పేరుతో పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన రషీద్, శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News