: శంషాబాద్ లాడ్జిలో అదుపులోకి వచ్చిన మంటలు... అంతా క్షేమం!
హైదరాబాదు శివారు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గర్లోని శ్రీ అనుపమ రెసిడెన్సీ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు మొదటి రెండు ఫ్లోర్లకు వ్యాపించడంతో ఆ ఎనిమిది అంతస్తుల భవనంలో ఉన్న వారంతా టెర్రస్ పైకి చేరారు. అయితే ఫైర్, పోలీసు, రెవెన్యూ, విపత్తు విభాగాలకు చెందిన అధికారులు మంటలను నియంత్రించడంతో కేవలం మూడు అంతస్తులు మాత్రమే దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పివేసి టెర్రస్ పై చిక్కుకున్న 50 మందిని కిందికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.