: నేడు సినారె అంత్యక్రియలు...సీఎం, మంత్రుల హాజరు


ప్రముఖ సాహిత్య వేత్త, ఆచార్య సి.నారాయణరెడ్డి (సినారె) అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సినారె భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కాసేపట్లో ఆయన నివాసం నుంచి సారస్వత పరిషత్ హాల్ కు ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. అనంతరం అక్కడ సాహితీ వేత్తల సందర్శన అనంతరం అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, టోలీచౌక్ మీదుగా మహాప్రస్థానానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. సినారె అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News