: సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ఏం చేస్తోందో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష గుర్తుందా?... సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై, తీవ్రంగా గాయపడి గత ఆగస్టులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల సానుభూతిని పొందిన ప్రత్యూష మీడియాలో ప్రముఖంగా నిలిచింది. అప్పట్లో ఆమెను పరామర్శించిన సీఎం ప్రత్యూషను తన దత్తపుత్రికగా స్వీకరిస్తున్నానని, ఆమె చదువు, పెళ్లి, భవిష్యత్ బాధ్యతలను తలకెత్తుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత తన ఇంటికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆమె విద్యకు అయ్యే సహాయం చేస్తోంది. తన కోరిక ప్రకారం ఆమె ప్రస్తుతం నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. ఆమె గురించిన సమాచారాన్ని కేసీఆర్ కు అధికారులు వివరించారు. దీంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.