: మనిషా.. స్పైడర్‌మ్యానా!.. తాడు కూడా లేకుండా 29 అంతస్తులు ఎక్కేశాడు!
చేతిలో ఎటువంటి పరికరాలు లేకుండా కేవలం 20 నిమిషాల్లో 29 అంతస్తులను ఎకాఎకిన ఎక్కేసి అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా చేశాడు ఫ్రెంచ్ క్లైంబర్ అలియన్ రాబర్ట్. ఇందుకు సంబంధించిన ఫుటేజ్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్’గా చిరపరిచతమైన 54 ఏళ్ల రాబర్ట్ బార్సిలోనాలోని 114 మీటర్ల (374 అడుగులు) పొడవైన మెలియా బార్సిలోనా స్కై హోటల్‌ను ఎటువంటి జంకుగొంకు లేకుండా తాడు సాయం కూడా లేకుండా సోమవారం చకచకా ఎక్కేశాడు. ప్రాణాపాయంతో కూడుకున్న సాహసం చేసినందుకు గాను రాబర్ట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వదిలేశారు. ఎటువంటి సాధనాలు లేకుండా అతి పొడవైన నిర్మాణాన్ని ఎక్కి రాబర్ట్ చరిత్ర సృష్టించాడు. రాబర్ట్‌కు ఇటువంటివి కొత్తకాదు. ఆయన గతంలోనూ పలు నిర్మాణాలను తాడు సాయం లేకుండా, అనుమతి లేకుండా ఎక్కేశాడు. కాగా, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇవ్వడంలో రాబర్ట్ దిట్ట.