: మళ్లీ దూసుకుపోతున్న జియో.. ఏప్రిల్‌లో 40 లక్షల మంది కొత్త వినియోగదారుల చేరిక
కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న జియో మళ్లీ జూలు విదిలుస్తోంది. ఏప్రిల్‌లో ఏకంగా 40 లక్షల మంది కొత్త వినియోగదారులు జియో సబ్‌స్కైబర్లుగా చేరినట్టు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని తెలిపింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో చేరిన వారితో కలిసి జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 11.2 కోట్లకు చేరుకుంది. మార్చిలో 9.28 శాతం ఉన్న జియో మార్కెట్ షేర్ ఏప్రిల్‌లో 9.58కు చేరుకుంది.
నిజానికి మార్చిలో జియోలో చేరిన సబ్‌స్కైబర్లతో పోలిస్తే ఏప్రిల్‌లో చేరిన వారి సంఖ్య తక్కువే. మార్చిలో 50.83 లక్షల మంది జియో చందాదారులుగా చేరగా ఏప్రిల్‌లో ఆ సంఖ్య 30.87 లక్షల మందికి పడిపోయింది. అయినప్పటికీ ఇతర నెట్‌వర్క్ కంపెనీలతో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం జియో భారత్ మార్కెట్లో నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన భారతీ ఎయిర్‌టెల్ 23.54 శాతం, వొడాఫోన్ 17.86 శాతం, ఐడియా సెల్యూలార్ 16.69 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి.