: బ్రాహ్మణ సంఘాల హెచ్చరికతో దిగొచ్చిన ‘డీజే’ దర్శకుడు హరీశ్ శంకర్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందించిన 'డీజే' సినిమాలోని 'గుడిలో బడిలో మడిలో వడిలో' అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ పాటలో అభ్యంతరంగా ఉన్న పదాలను తొలగిస్తామని ముందుగా తమకు హామీ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్.. ఇప్పుడు మాట తప్పారని, తాము చూస్తూ ఊరుకోబోమని ఈ రోజు బ్రాహ్మణ సంఘాల సభ్యులు హెచ్చరిస్తూ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో హరీశ్ శంకర్ దిగొచ్చాడు. ఆ పాటలో వివాదాస్పదమైన పదాలను తాము స్వచ్ఛందంగా తొలగిస్తున్నామని తెలిపాడు. పాటలోని ఆ పదాలను తొలగించి, కొత్త పదాలను చేర్చి పాటను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పాటల సీడీని విడుదల చేస్తామని చెప్పాడు. దీంతో వివాదానికి తెరపడేటట్లు కనపడుతోంది. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాల పదాలతో పాటు.. అగ్రహారం, తమలపాకు పదాలు ఇకపై ఆ పాటలో ఉండవు.