: ఎల్లుండి జరగనున్న మ్యాచ్ లో భారత్‌ను ఓడిస్తాం: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్


ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ -ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ గ్రూప్-బీ లో అగ్ర‌స్థానంలో ఉన్న టీమిండియాతో ఎల్లుండి త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ గాజి అష్రఫ్ మాట్లాడుతూ.. తాము ఆ  మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్‌కు వెళ‌తామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. టీమిండియా లాంటి బలమైన జట్టుపై విజ‌యం సాధించేందుకు త‌మ జ‌ట్టు ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయ‌న సూచించాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీని చేజిక్కించుకోవ‌డానికి ఇది ఉత్తమ అవకాశమని ఆయ‌న అన్నాడు.         

  • Loading...

More Telugu News