: విజయ్ మాల్యాకు ఆరు నెలల వరకు బెయిల్ పొడిగింపు.. బ్రిటన్ కోర్టు ఆదేశాలు!
భారతీయ బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు లండన్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువును మరో ఆరు నెలల వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అనంతరం కోర్టు బయట విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ... తాను నిర్దోషినని అన్నారు. భారత సర్కారు తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని చెప్పారు.