: హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షం
హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంది. నగరంలోని పలుచోట్ల ఈ రోజు చిరుజల్లులు పడ్డాయి. తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, రామాంత పూర్, నేరేడ్‌మెట్, మెట్టుగూడ, మల్కాజిగిరి ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు వెళుతున్నాయి. కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులు తొలకరి జల్లులు పడుతుండడంతో సేదతీరుతున్నారు.