: ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టుతోనే టీమిండియా తలపడాలని అందరూ కోరుకుంటున్నారు: కోహ్లీ


చాంపియన్స్ ట్రోఫీలో ఇంకా మూడు మ్యాచులే మిగిలి ఉన్న విష‌యం తెలిసిందే. రేపు ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌గ‌నుండ‌గా ఎల్లుండి టీమిండియా, బంగ్లాదేశ్ ల మ‌ధ్య మ‌రో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచుల్లో గెలిచిన జ‌ట్లు వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి. ఈ నేప‌థ్యంలో టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... క్రికెట్ ప్రేమికులందరూ ఫైనల్ మ్యాచ్‌ భారత్-ఇంగ్లండ్‌ల మధ్యే జరగాలని కోరుకుంటున్నారని అన్నాడు. తాము సెమీస్‌లో ఎవరితో తలపడబోతున్నామన్నది సమస్య కాదని చెప్పాడు. సెమీ ఫైన‌ల్‌లో గెలిచి ఫైనల్స్‌లోకి ప్ర‌వేశించి తీరుతామ‌ని అన్నాడు. ప్రేక్ష‌కులు కోరుకుంటున్నట్లు ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌-భార‌తే త‌ల‌ప‌డ‌తాయ‌ని జోస్యం చెప్పాడు. 

  • Loading...

More Telugu News