: రేపు న్యూఢిల్లీలో అదరహో అనేలా ట్రంప్ బర్త్‌డే వేడుక.. జంతర్ మంతర్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్ కూడా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత్‌లోని హిందూసేన ఎంతో అభిమానాన్ని చూపిస్తోంది. గతంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలవాలని హిందూసేన పూజలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. రేపు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హ్యాపీ బర్త్ డే చెబుతూ ఢిల్లీలో హిందూసేన 'రాజ్‌తిలక్' సెర్మనీ పేరుతో ఘనంగా పండుగ చేసుకోనుంది. ట్రంప్‌ను వారు మానవతా పరిరక్షకుడుగా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ జీవిత చరిత్రను తెలుపుతూ అక్కడి జంతర్‌మంతర్ వద్ద ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాము గతేడాది కూడా ట్రంప్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించామని, రేపు మరింత అదిరిపోయేలా చేస్తామని చెప్పారు.