: అల్లు అర్జున్ ‘డీజే’లోని ‘గుడిలో బడిలో మడిలో’ పాటపై మళ్లీ ఆందోళ‌న.. మంత్రికి ఫిర్యాదు!


టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ‘డీజే’ సినిమాలోని సాహితి రాసిన ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’... ‘అస్మైక యోగ తస్మైక భోగ’ అనే పాటపై త‌లెత్తిన వివాదం ఇంకా ముగియ‌లేదు. ఆ పాట‌లోని ‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’ అంటూ హీరోయిన్‌ని వ‌ర్ణించ‌డం ప‌ట్ల బ్రాహ్మ‌ణ సంఘాలు ఇప్ప‌టికే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసి, హ‌రీశ్ శంక‌ర్‌ను క‌లిశారు.

హ‌రీశ్ శంక‌ర్ కూడా అగ్రహారం, తమలపాకు వంటి ఆ ప‌దాల‌ను తొల‌గిస్తామ‌ని మాట ఇచ్చార‌ని బ్రాహ్మ‌ణ సంఘాలు ప్ర‌క‌ట‌న చేశాయి. అయితే, హ‌రీశ్ శంక‌ర్ ఆ ప‌దాల‌ను తొల‌గించ‌కుండానే సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఆ విష‌యంపై బ్రాహ్మ‌ణ సంఘాల స‌భ్యులు ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News