: పరిటాల ఘాట్ ను సందర్శించిన నందమూరి తారకరత్న!


మాజీ మంత్రి పరిటాల రవి ఘాట్ ను సినీ హీరో నందమూరి తారకరత్న నేడు సందర్శించారు. అనంతపురం జిల్లాలోని రవి స్వగ్రామం వెంకటాపురానికి నేడు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా తారకరత్నకు పరిటాల శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు. ఘాట్ ను సందర్శించిన అనంతరం తమ ఇంట్లోకి తారకరత్నను తీసుకెళ్లారు పరిటాల శ్రీరామ్. అక్కడే ఆయన అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత, శ్రీరామ్ లతో ఆయన కాసేపు ముచ్చటించారు.

మరోవైపు, తారకరత్నను చూసేందుకు పలువురు గ్రామస్తులు అక్కడకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతంలో షూటింగ్ లలో పాల్గొన్నానని... అప్పుడే పరిటాల కుటుంబంతో తనకు పరిచయాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రస్తుతం బాలయ్య జన్మదిన వేడుకల కోసం జిల్లాకు వచ్చానని... ఈ నేపథ్యంలోనే, పరిటాల ఘాట్ ను సందర్శించుకోవడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు. 

  • Loading...

More Telugu News