: విజయసాయిరెడ్డి కామెంట్స్ పై మండిపడ్డ ఎమ్మెల్యే అనిత!
తన గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. భూదందాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆమె తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే, ఆయన కాళ్లు కడిగి, నెత్తిన నీళ్లు చల్లుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించడానికి ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలపై తాను ఇంతవరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదని అన్నారు. తన గురించి అసభ్య పోస్టులు పెట్టినవారిపై మాత్రమే కేసులు పెట్టానని స్పష్టం చేశారు.