: అమ్మమ్మ ఇంటికి వెళుతున్న రాహుల్ గాంధీ!
రాజకీయాల్లో గత కొంతకాలంగా బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. మరోసారి ఇటలీ ట్రిప్ కు ఆయన వెళుతున్నారు. ఈ సందర్భంగా, తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నట్టు ట్విట్టర్ ద్వారా రాహుల్ తెలిపారు. కొన్ని రోజుల పాటు అమ్మమ్మతో పాటు, ఇటలీలోని బంధువులతో గడిపి వస్తానని చెప్పారు. గతంలో రాహుల్ ఎప్పుడూ రహస్యంగానే విదేశాలకు వెళ్లేవారు. అయితే, తన పర్యటనలపై విమర్శలు వస్తుండటంతో... ఈ సారి తన పర్యటన వివరాలను ముందుగానే ట్విట్టర్ ద్వారా రాహుల్ పంచుకున్నారు.