: నోకియా అభిమానులకు శుభవార్త.. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను విడుద‌ల చేసిన సంస్థ!


నోకియా అభిమానుల‌కు శుభ‌వార్త‌... ఆ కంపెనీ సెల్‌ఫోన్‌ల‌ను ఇష్ట‌ప‌డేవారు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు భార‌త్‌లో విడుద‌లయ్యాయి. ఢిల్లీలో ఈరోజు ఉద‌యం నిర్వ‌హించిన ఓ ప్రోగ్రాంలో నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ ఫోన్లను హెచ్‌ఎండీ సంస్థ రీలీజ్ చేసింది. ఇటీవలే నోకియా 3310 పేరుతో రూ.3310 ధ‌ర‌తో ఐకానిక్‌ ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

 నోకియా 6  స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. వ‌చ్చేనెల 14 నుంచే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు...  5.5 అంగుళాల డిస్‌ప్లే,  ఆండ్రాయిడ్‌ 7 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 3 జీబీ ర్యామ్‌, 32జీబీ అంతర్గత మెమొరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా,  ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్ సౌక‌ర్యం ఉన్నాయి.

ఇక‌, నోకియా 5 మొబైల్‌ ధర రూ. 12,899గా ఉంది. జులై 7 నుంచి ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు... 5.2 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌,  2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్ లు ఉన్నాయి. నోకియా 3 మోడ‌ల్ ధర రూ. 9,499గా ఉంది. ఈ నెల‌ 16 నుంచే అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు... 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ, 8 మెగాపిక్సెల్‌తో ముందు, వెనుక కెమెరాలు,  2650 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.          

  • Loading...

More Telugu News